: బంకర్ కు నిప్పంటుకుని భారత జవాను మృతి


జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోని కుప్వారా సెక్టార్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బంకర్ కు నిప్పంటుకుని జాట్ రెజిమెంటుకు చెందిన ఓ భారత సైనికుడితో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బంకర్ లో కిరోసిన్, కోక్ హీటర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనపై విచారణ ప్రారంభమయింది.

  • Loading...

More Telugu News