: ఢిల్లీకీ చేరిన కిస్ ఆఫ్ లవ్!
కేరళలో మొదలైన కిస్ ఆఫ్ లవ్, తాజాగా దేశ రాజధాని ఢిల్లీకీ చేరింది. కేరళలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో కొందరు యువతీ యువకులు ఢిల్లీ వీధుల్లో ఈ వినూత్న నిరసనకు తెరతీశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన యువత లిప్ లాక్ లకే పరిమితం కాకుండా పోలీసుల వైఖరికి నిరసనగా మానవహారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లిక్ మన్న ఫొటోలు సామాజిక వెబ్ సైట్లలో హల్ చల్ చేశాయి.