: రాజధాని ప్రాంత ప్రజలకు చంద్రబాబు భరోసా ఇవ్వాలి: డొక్కా


ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రతిపాదించిన గ్రామాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించాలని... ప్రజలతో చర్చించి వారి అనుమానాలను తొలగించి, భరోసా కల్పించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. తుళ్లూరు మండలంలోని 40వేల జనాభాలో 17 వేల మంది రైతులున్నారని... మిగిలిన వారంతా కూలీలు, చేతి వృత్తుల వారని... వారికి న్యాయం జరగకపోతే సామాజిక అసమానతలు తలెత్తుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News