: కొడుకును పోలీసులు కొట్టడం చూసి ఆగిన తల్లి గుండె!


తన కళ్లెదుటే పోలీసులు కొడుకును కొట్టడం చూసిన ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. కాని పోలీసులను ఎదిరించే ధైర్యం లేదు కదా. మరి ఏం చేస్తుంది? ఏం చేయలేక నిలిచిపోయింది. బంధువులనే కాక, కరకు పోలీసుల గుండెలను కూడా పిండేసిన ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకుంది. ఓ కేసులో అనుమానితుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చారు. అతడిని అందరిముందే కొట్టడం మొదలుపెట్టారు. పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్న కొడుకును చూసి తట్టుకోలేని అతడి తల్లి గుండె పగిలి మృతి చెందింది. దీంతో ఆగ్రహావేశాలకు గురైన బాధితురాలి బంధువులు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

  • Loading...

More Telugu News