: తొమ్మిది మంది తొలిసారి ఎంపీలకు మంత్రి పదవులు!


ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లోని తొమ్మది మంది మంత్రులు తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టిన వారే . గతంలో ఈ తరహాలో ఇంత పెద్ద సంఖ్యలో తొలిసారి ఎంపీలకు మంత్రి పదవులు దక్కలేదు. ఈ తొమ్మిది మందిలో భారత షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు సయంత్ సిన్హా, సాధ్వీ నిరంజన్ జ్యోతి, విజయ్ సంప్లా, గిరిరాజ్ సింగ్, మహేశ్ శర్మ, మోహన్ కుందరియా, సన్వర్ లాల్ జాట్, బాబుల్ సుప్రియో ఉన్నారు. వీరిలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తో పాటు బాబుల్ సుప్రియోలకు అసలు రాజకీయ అనుభవమే లేకపోవడం గమనార్హం. అయితే ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రమాణం చేసిన తీరు రాజకీయ ఉద్ధండులనే ముగ్ధులను చేసింది. ఆరితేరిన రాజకీయ వేత్తలు కూడా పేపర్ పై రాసుకున్న ప్రమాణాన్ని చదివితే, రాథోడ్ మాత్రం తనదైన రీతిలో అలవోకగా ప్రమాణం చేశారు.

  • Loading...

More Telugu News