: నేడు బెంగళూరుకు ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక నుంచి రాయలసీమకు రావాల్సిన 32 టీఎంసీల తాగు, సాగు నీటి విడుదలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చంద్రబాబు చర్చించనున్నారు. అంతేకాక ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలపైన కూడా ఆయన సిద్ధరామయ్యతో చర్చలు జరుపుతారని సమాచారం.