: మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం...సిరీస్ కైవసం
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలోనూ టీమిండియా లంకపై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను ఇంకా రెండు వన్డేలు మిగిలుండగానే కోహ్లీ సేన చేజిక్కించుకుంది. 243 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 44.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 91 పరుగులు చేసి సెంచరీ సమీపంలో ఔటవ్వగా కోహ్లీ అర్ధ సెంచరీతో చెలరేగాడు. 135 ఇన్నింగ్స్ ల్లో ఆరు వేల పరుగులు చేసిన కోహ్లీ, వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. లంక తరఫున ఒంటరి పోరు చేసి సెంచరీ నమోదు చేసిన జయవర్ధనే శ్రమ వృధా అయ్యింది.