: రాయుడు నిరాశపరిచాడు...35 పరుగుల తర్వాత రనౌట్
శ్రీలంకతో రెండో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించిన తెలుగు తేజం అంబటి రాయుడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో అభిమానులను నిరాశపరిచాడు. వన్ డౌన్ లోనే బ్యాటింగ్ కు దిగిన రాయుడు తొలుత లంక బౌలర్లను సమర్ధంగానే ఎదుర్కున్నాడు. 46 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు కూడా ఉన్నాయి. దీంతో మూడో వన్డేలోనూ రాయుడు లంకేయులకు చుక్కలు చూపడం ఖాయమనుకుంటున్న తరుణంలో రనౌటయ్యాడు. దీంతో ఒక్కసారిగా హైదరాబాదీ క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు.