: బీజేపీకి దూరమయ్యే యోచన ఇప్పటికీ లేదు: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే


కేంద్ర కేబినెట్ విస్తరణలో భంగపాటుకు గురైన శివసేన, బీజేపీతో పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. ఈమేరకు ఆదివారం సాయంత్రం ముంబైలో పార్టీ శాసన సభ పక్ష భేటీ తర్వాత ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్న ఆయన ఆ దిశగా బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. బీజేపీకి దూరమయ్యే యోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎన్సీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే మాత్రం విపక్షంలో కూర్చుంటామని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే, సభలో తమ నేతగా ఏక్ నాథ్ షిండేను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

  • Loading...

More Telugu News