: 10 ఓవర్లలో టీమిండియా స్కోరు 58
శ్రీలంక జట్టు నిర్దేశించిన 243 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. అజింక్య రెహానే, శిఖర్ ధావన్ లు టీమిండియా బ్యాటింగ్ ను ప్రారంభించారు. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండానే అర్ధ సెంచరీ పూర్తి చేసిన టీమిండియా 58 పరుగులు రాబట్టింది. రెహానే 29 పరుగులు చేయగా, ధావన్ 24 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.