: దత్తన్న, సుజనాలకు అభినందనల వెల్లువ
కేంద్ర మంత్రిమండలిలో కొత్తగా చోటు దక్కించుకున్న తెలుగు మంత్రులు బండారు దత్తాత్రేేయ, సుజనా చౌదరిలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు నెలల క్రితం అధికారం చేపట్టిన మోదీ కేబినెట్ లో ఇప్పటికే తెలుగు నేతలు వెంకయ్యనాయుడు, అశోక గజపతిరాజు, నిర్మలా సీతారామన్ లు కొనసాగుతున్నారు. తాజాగా ఆదివారం జరిగిన విస్తరణలో భాగంగా ఏపీ నుంచి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, తెలంగాణకు చెందిన లోక్ సభ సభ్యుడు బండారు దత్తాత్రేయలకు మంత్రి పదవులు దక్కాయి. దీంతో మోదీ కేబినెట్ లో తెలుగు నేతల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేసిన దత్తాత్రేయ, సుజనా చౌదరిలకు వారి అభిమానులు, మద్దతుదారుల నుంచి పెద్ద ఎత్తున అభినందన సందేశాలు అందుతున్నాయి. టీవీ చానెళ్లలో సుజనా చౌదరిని అభినందిస్తూ పెద్ద ఎత్తున ప్రకటనలు ప్రసారమవుతున్నాయి.