: మూడున్నరేళ్లలో పోలవరం నిర్మాణం పూర్తి: దేవినేని ఉమ


రానున్న మూడున్నరేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. ఆదివారం నవ్యాంధ్రప్రదేశ్ రాజదాని తుళ్లూరులో మంత్రివర్గ ఉపసంఘం పర్యటించింది. ఈ సందర్భంగా మంత్రివర్గ సభ్యులు రాజధాని పరిధిలోని గ్రామాల రైతులతో భేటీ అయ్యారు. రైతుల ఆందోళనలను పూర్తిగా విన్న ఉపసంఘం, భూముల అప్పగింతకు సంబంధించి ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చింది. రైతులకు పూర్తి న్యాయం చేయడంతో పాటు పేదలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని మంత్రి ఉమ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోగా పూర్తి చేసి, కొత్త రాష్ట్రంలో మరింత సాగు భూమిని స్థిరీకరిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News