: ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా!
హైదరాబాద్ లో బ్లాక్ టికెట్ల దందా ఒక్క సినిమా థియేటర్లకే పరిమితం కాలేదు. ఈ అక్రమ దందా తాజాగా క్రికెట్ మ్యాచ్ లకూ పాకింది. ఈ బ్లాక్ టికెట్ల దందానే ఆదివారం ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తతకు దారి తీసిందని పోలీసులు నిర్ధారించారు. కొందరు వ్యక్తులు భారత్, లంక జట్ట మధ్య కొనసాగుతున్న మూడో వన్డే మ్యాచ్ టికెట్లను ఐదింతల అధిక ధరకు బ్లాక్ లో విక్రయిస్తున్నారన్న అభిమానుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకోవడంతో వివాదం మొదలైంది. రూ.300 టికెట్ ను రూ.1000కి, రూ.500 టికెట్ ను రూ.1,500కి విక్రయిస్తున్న కొందరు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో వారు పోలీసులపైకి దాడి చేయడం, ఆ తర్వాత పోలీసులు బ్లాక్ టికెట్లను విక్రయిస్తున్న వారిపై విరుచుకుపడటంతో ఉద్రిక్తత నెలకొంది.