: మూడో వన్డేలో భారత లక్ష్యం 243


హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక జట్టు టీమిండియాకు 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పూర్తి ఓవర్లు కూడా ఆడలేని శ్రీలంక 48.2 ఓవర్లలోనే ఆలౌటైంది. భారత బౌలర్ల మెరుపులతో లంక వికెట్లు టపటపా పడిపోయాయి. భారత ఫేసర్ ఉమేశ్ యాదవ్ తన పదునైన బౌలింగ్ తో తొలి ఓవర్ లోనే లంక ఓపెనర్ పెరీరాను పెవిలియన్ చేర్చడంతో పాటు తన రెండో ఓవర్ తొలి బంతికే సంగక్కరను ఓట్ చేశాడు. లంక వికెట్లు వరుసగా పడిపోతున్నా లంక స్టార్ క్రికెటర్ జయవర్ధనే నిలకడగా రాణించి 118 పరుగులు చేయడంతో లంక 242 పరుగులు చేయగలిగింది.

  • Loading...

More Telugu News