: శివసేనకు సురేశ్ ప్రభు రాజీనామా...బీజేపీలో చేరిక!
శివసేన కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ వేసిన ఎత్తుగడ ఫలించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఆదివారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సురేశ్ ప్రభు శివసేనకు రాజీనామా చేశారు. వెనువెంటనే బీజేపీలో చేరిపోయారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత కేవలం గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమను ఇరుకున పెడుతున్న శివసేనకు రాజీనామా చేసిన సురేశ్ ప్రభుకు కీలకమైన రైల్వే శాఖను అప్పగించేందుకు ప్రధాని మోదీ సిద్ధపడ్డట్టు సమాచారం