: మోదీ కేబినెట్ సభ్యుల సంఖ్య 66
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారులో మంత్రుల సంఖ్య 66 కు చేరింది. మే నెలలో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ, 44 మందిని తన కేబినెట్ లో సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లో మోదీ సహా మొత్తం సభ్యుల సంఖ్య నిన్నటిదాకా 45 గా ఉంది. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి నిన్నటిదాకా నాటి కేబినెట్ సభ్యులతోనే పాలన సాగించిన మోదీ, ఆదివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. తాజా విస్తరణలో 21 మంది కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రస్తుతం మోదీ కేబినెట్ లో మంత్రుల సంఖ్య 66కు చేరినట్లైంది.