: కొత్త మంత్రుల్లో నలుగురికే కేబినెట్ హోదా!


నరేంద్ర మోదీ తొలి మంత్రివర్గ విస్తరణలో నలుగురికి మాత్రమే కేబినెట్ హోదా దక్కింది. ముగ్గురు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా ప్రమాణం చేయగా, 14 మంది సహాయ మంత్రులుగా పదవులు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాలులో జరిగిన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో బాగంగా మొత్తం 21 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఏపీ నుంచి సుజనా చౌదరి సహాయ మంత్రిగా పదవి చేపట్టగా, తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. సాయంత్రంలోగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులతో పాటు ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలు పర్యవేక్షిస్తున్న మంత్రుల శాఖల పునర్వ్యస్థీకరణ జరగనుంది. కొత్త మంత్రుల్లో ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మహిళ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

  • Loading...

More Telugu News