: నంద్యాలలో జంట హత్యల కలకలం
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జంట హత్యలు కలకలం రేపాయి. పాత నేరస్తులు బుక్కాపురం శివ, బాలాంజనేయులు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు వీరిద్దరినీ నరికి చంపారు. కొన్నాళ్ల క్రితం నంద్యాలలోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన జంట హత్యల కేసులో శివ, బాలాంజనేయులు నిందితులు కావడం గమనార్హం.