: నేడు కేంద్ర క్యాబినెట్ విస్తరణ... ఢిల్లీ పయనమైన చంద్రబాబు
ఢిల్లీలో నేడు కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 1.30కి జరిగే ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితోపాటు మరో 20 మందికి మోదీ మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు.