: పాక్ లో విస్తరిస్తున్న ఐఎస్ఐఎస్ విషవృక్షం!


ఇరాక్, సిరియా దేశాల్లో వేళ్లూనుకున్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్ సంస్థ పాకిస్థాన్ లోనూ విస్తరిస్తోందని భద్రత సంస్థలు అంటున్నాయి. స్థానిక షియా వ్యతిరేక గ్రూపులతో చేతులు కలపడం ద్వారా పాక్ లోనూ పాతుకుపోయేందుకు యత్నాలు ప్రారంభించిందని 'డాన్' పత్రిక తన వెబ్ సైట్లో పేర్కొంది. ఐఎస్ఐఎస్ ఖైబర్ పక్తుంక్వా ప్రాంతంలో 10000 నుంచి12000 మంది వరకు అనుచరులను రిక్రూట్ చేసుకుందట. గిరిజన ప్రాంతాల్లో పాక్ సైన్యం చేపట్టిన 'జర్బ్-ఐ-అజబ్' ఆపరేషన్ కు ప్రతిగా సైనిక స్థావరాలపై దాడులు చేయాలని ఐఎస్ఐఎస్ భావిస్తోందని 'డాన్' తెలిపింది. అంతేగాకుండా, షియా ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తోందట. దీంతో, బెలూచిస్తాన్ ప్రభుత్వం నిఘా వర్గాలను అప్రమత్తం చేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేసింది. దీనిపై భద్రత నిపుణుడు ఇజాజ్ హుస్సేన్ స్పందిస్తూ, ఐఎస్ఐఎస్ కార్యకలాపాలను ఈ దశలో గుర్తించకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదని హెచ్చరించారు. ఐఎస్ఐఎస్ పాక్, ఆఫ్ఘనిస్తాన్ లపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని, ముఖ్యంగా, ఆఫ్ఘన్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కి మరలిపోతున్న తరుణంలో ఇది మరింత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News