: మూసీవాగులో సైట్ ఇంజనీర్ గల్లంతు
నల్గొండ జిల్లా భువనగిరి మండలం సూరేపల్లి వద్ద మూసీవాగులో ఓ సైట్ ఇంజనీర్ గల్లంతయ్యారు. చేతిలోని కాగితాలు నీటిలో పడిపోవడంతో, వాటిని తీసుకునే ప్రయత్నంలో ఆయన ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఆయనను ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సైట్ ఇంజినీర్ ఎల్లయ్యగా గుర్తించారు. అధికారులు గాలింపు చేపట్టారు.