: అడ్డుకునే వారిని సస్పెండ్ చేసైనా సరే సభ జరిపి తీరుతాం: హరీష్ రావు
అసెంబ్లీని అడ్డుకుని, గందరగోళం సృష్టించే వారిని సస్పెండ్ చేసైనా సరే సభా కార్యక్రమాలను కొనసాగిస్తామని టీఎస్ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. టీటీడీపీ నేతలు తెలంగాణ గాలి పీలుస్తూ, తెలంగాణ తిండి తింటూ, చంద్రబాబుకు వంతపాడుతున్నారని విమర్శించారు. కావేరి జలాల కోసం తమిళనాడు మొత్తం ఏకమైన సంగతిని టీటీడీపీ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై కూడా హరీష్ రావు మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్న జానారెడ్డి తన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని... ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయలేదా? అని ప్రశ్నించారు.