: ప్రధాని పర్యటన సందర్భంలో పనిచేయని కంట్రోల్ రూం మానిటర్లు
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ రోజు ఆయన 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కంట్రోల్ రూమ్ మానిటర్లు పనిచేయడం మానేశాయి. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఐబీ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.