: ఈ నెల 11న మైనార్టీ సంక్షేమ దినం: టీఎస్ ప్రభుత్వం
ఈ నెల 11న మైనార్టీ సంక్షేమ దినంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేసిన మౌలానా అజాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని... మైనార్టీ సంక్షేమ దినాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ సంక్షేమ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.