: ఢిల్లీ బయలుదేరిన దత్తన్న
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో దత్తాత్రేయకు చోటు లభించిన సంగతి తెలిసిందే. దీంతో, రేపు మధ్యాహ్నం జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పాల్గొనేందుకు ఆయన కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు.