: కాకతీయుల జలవనరులను వలస ప్రభుత్వాలు ధ్వంసం చేశాయి: హరీష్ రావు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన గత ప్రభుత్వాలపై టీఎస్ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. కాకతీయులు తవ్వించిన జలవనరులను గతంలో పరిపాలించిన వలస ప్రభుత్వాలు ధ్వంసం చేశాయని ఆయన ఆరోపించారు. కాకతీయుల స్ఫూర్తిని తాము చేతల్లో చూపిస్తామని... రాష్ట్రంలోని 45 వేల చెరువులను దశలవారిగా పునరుద్ధరిస్తామని తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్టీ ఫిరాయింపులను ఎన్నో సార్లు ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు టీఆర్ఎస్ ను తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News