: వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ ను 9 గంటలకు పెంచుతాం: చంద్రబాబు
రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తామని... వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామని తెలిపారు. కడప జిల్లా రైల్వేకోడూరులో నిర్వహించిన 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ వివరాలను వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 1000 పింఛను ఇస్తున్నామని చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని తెలిపారు.