: తుపాను బాధితులకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ భారీ కార్యక్రమం


ఏపీ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారీ కార్యక్రమం నిర్వహించబోతుంది. ఈ నెల 30న 'మేము సైతం' పేరుతో హైదరాబాదులోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వినోద కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. దాని ద్వారా వచ్చే నిధులను ఏపీ సీఎం సహాయనిధికి అందించనుంది. సినీ తారలు, సంగీత దర్శకులు, డ్యాన్సర్లతో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఉంటాయని తెలుగు చిత్ర నిర్మాతల మండలి మీడియా సమావేశంలో తెలిపింది. సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. తుపాను బాధితులకు సహాయం అందిద్దామని నటుడు, ఎంపీ మురళీమోహన్ ఈ సందర్భంగా సమావేశంలో అన్నారు. గతంలోనూ విపత్తుల సమయంలో పరిశ్రమ సహాయపడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమ వివరాలు www.memusaitam.com లో ఉంటాయని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. విదేశాల్లో ఉన్న వారికి కూడా ఈ వెబ్ సైట్ సహాయపడుతుందన్నారు. సినీ పరిశ్రమ మొత్తం ఏకమై 'మేము సైతం' కార్యక్రమం నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News