: జన్మభూమిలో తేనెటీగల దాడి... పరిటాల సునీత సేఫ్
అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమలలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో అలజడి చెలరేగింది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. కార్యక్రమానికి హాజరైన మంత్రి పరిటాల సునీత సురక్షితంగా కారులోకి వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.