: సదానందగౌడకు 'సన్' స్ట్రోక్?
కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడకు టైం బాగున్నట్టు అనిపించడం లేదు. రేపు జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో గౌడకు డిమోషన్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. పనితీరు ఆధారంగా కొంతమంది శాఖల మార్పు, మరికొంతమందిని పదవుల నుంచి తప్పించడం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో, సదానందగౌడ పనితీరు పట్ల మోదీ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీనికి తోడు, సదానంద కుమారుడు కార్తీక్ వివాదం కూడా ఆయన మంత్రి పదవికి ఎసరు పెడుతున్నట్టు సమాచారం.