: యూపీఏ ప్రభుత్వమే 2జీ లైసెన్సులను రద్దుచేసి ఉండాల్సింది: చిదంబరం


సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూడకుండా 2జీ లైసెన్సులను యూపీఏ ప్రభుత్వమే రద్దుచేసి ఉండాల్సిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. లైసెన్సులు రద్దు చేయమని తాను ముందే చెప్పానని, కానీ చివరి నిర్ణయం కోర్టుల చేతుల్లోకి వెళ్లిందని చెప్పారు. ఈ కుంభకోణంపై సరిగా చర్యలు తీసుకోనందువల్లనే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలసి చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ముందు వచ్చిన వారికే ముందు అనుమతులు' (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్) అన్న ప్రాతిపదికన 2జీ లైసెన్సులను కేటాయించడాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిరాకరించి ఉండాల్సిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News