: టీఎస్ ప్రభుత్వం అబద్ధాలకోరు... అవాస్తవాలు చెబుతోంది: బీజేపీ
కేసీఆర్ సర్కారుపై తెలంగాణ బీజేపీ మండిపడింది. రోజుకో అబద్ధం చెబుతూ, అవాస్తవాలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతోందని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్రం నుంచి 350 మెగావాట్ల విద్యుత్ వచ్చిందా? లేదా? అనే విషయాన్ని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు ముమ్మాటికీ కేసీఆరే కారణమని అన్నారు.