: గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్
గోవా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన పేరును బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ ఢిల్లీలో వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటలకు గోవా సీఎంగా పర్సేకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పారు. కేంద్ర కేబినెట్ లోకి వెళుతున్న నేపథ్యంలో మనోహర్ పారికర్ గోవా సీఎంగా ఈరోజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో, ప్రస్తుతం ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా ఉన్న గత ఆర్ఎస్ఎస్ నేత అయిన పర్సేకర్ కు సీఎం అవకాశం దక్కింది.