: బ్రాహ్మణితో కలసి 'బేబీమూన్'కు వెళుతున్న నారా లోకేష్
తన అర్ధాంగి బ్రాహ్మణితో కలసి టీడీపీ యువనేత నారా లోకేష్ 'బేబీమూన్' కోసం అమెరికా వెళుతున్నారు. డెలివరీకి ముందు భార్యాభర్తలు కలసి ఏకాంత విహారయాత్రకు వెళ్లడాన్ని బేబీమూన్ అంటారు. ''సరదాగా గడపడానికి నాకు, బ్రాహ్మణికి రెండేళ్ల తర్వాత సమయం దొరికింది. ప్రస్తుతం బ్రాహ్మణి గర్భవతి. వచ్చే నెల నుంచి బ్రాహ్మణి ప్రయాణించడానికి వీలుపడదు. అందుకే బేబీమూన్ కు వెళుతున్నాం" అని లోకేష్ తెలిపారు. అయితే, అమెరికాలో వారి పర్యటన వివరాలు మాత్రం తెలియరాలేదు. బ్రాహ్మిణి చెల్లెలు భర్త భరత్ అమెరికాలో చదువుకుంటున్నారు. అతను వీరికి తోడుగా ఉంటారని తెలుస్తోంది.