: ఏపీ రాజధాని ఎల్లలివే: చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని సరిహద్దులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రకటించారు. గుంటూరు ఆటోనగర్ నుంచి తూర్పు దిక్కుగా ప్రకాశం బ్యారేజీ నుంచి పదిన్నర కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. పశ్చిమాన బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఇది విస్తరించి ఉంటుంది. దక్షిణాన ఆటోనగర్ వై జంక్షన్ నుంచి 16 కిలోమీటర్ల పొడవునా 75 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వరకు రాజధాని ఎల్లలుగా ఉంటాయని చంద్రబాబు ప్రకటించారు. రాజదాని ఎల్లలు... పడమర: బోరుపాలెం నుంచి రింగు రోడ్డు దాకా(6 కిమీ) తూర్పు: ఆటో నగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ (10 కిమీ) ఉత్తరం: బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ (18కిమీ) దక్షిణం: ఆటో నగర్ నుంచి రింగు రోడ్డు (16 కిమీ)