: 2015 వన్డే ప్రపంచ కప్ టీమిండియాదే: సచిన్


మెరుగైన ప్రదర్శనతో దూసుకెళుతున్న టీమిండియా 2015 వన్డే ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఈసారి టీమిండియాకు స్పిన్నర్లు కప్ ను అందించనున్నారని అతడు శనివారం లండన్ లో వ్యాఖ్యానించాడు. కప్ రేసులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఉన్నాయని, అయితే టీమిండియానే కప్ ను ఎగరేసుకుపోతుందని జోస్యం చెప్పాడు. ప్రపంచ కప్ పోటీలు జరిగే ఆస్ట్రేలియా పిచ్ లు పేస్ బౌలర్లకు సహకరించినా, ఈ దఫా టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా రాణించి జట్టుకు కప్ ను అందిస్తారని సచిన్ చెప్పాడు. ఫిబ్రవరి 14న తొలి మ్యాచ్ తో ప్రారంభం కానున్న 2015 ప్రపంచ కప్, మార్చి 29న మెల్ బోర్న్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.

  • Loading...

More Telugu News