: అర్హులందరికీ ‘ఆసరా’ పింఛన్లు: కేసీఆర్
తెలంగాణలో అర్హులందరికీ ‘ఆసరా’ పింఛన్లు అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ 'ఆసరా' పింఛన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదకు 'ఆసరా' పింఛనును జారీ చేస్తామన్నారు ఇందుకోసం ఏటా రూ.4 వేల కోట్లను వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఈ నెల నుంచే ఆసరా పింఛన్ల పంపిణీని మొదలుపెట్టామన్నారు. మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో రెప్పపాటు కాలం కూడా విద్యుత్ కోతలుండవన్నారు. ఏడాదిలో పంటలు ఎండిపోని స్థాయిలో విద్యుత్ ను సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు.