: ఛత్తీస్ గఢ్ లో మావోల పంజా... మూడు జిల్లాల్లో వరుస దాడులు


ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు శనివారం పంజా విసిరారు. ఏకకాలంలో మూడు జిల్లాల్లో ధ్వంస రచనకు దిగి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సుకుమా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో దాడులకు తెగబడ్డారు. ఛత్తీస్ గఢ్ లో మావోల దాడుల నేపథ్యంలో కిరండోల్-విశాఖల మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సుకుమా, దంతెవాడ జిల్లాల్లో వరుస దాడులకు దిగిన మావోలు ఐరన్ ఓర్ ట్రక్కులు, జేసీబీలను ధ్వంసం చేశారు. కాక్లూర్ రైల్వే స్టేషన్ పై దాడి చేశారు. రైల్వే శాఖ వైర్ లెస్ సెట్ ను అపహరించుకునిపోయారు. ఛత్తీస్ గఢ్ లో మావోల దాడుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • Loading...

More Telugu News