: ఈ సాయంత్రం 4 గంటలకు గోవా కొత్త సీఎం పేరు ప్రకటన
కేంద్ర కేబినెట్ లో మనోహర్ పారికర్ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో సమావేశమైన బోర్డు, గోవా సీఎం ఎంపిక, ఉత్తరప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల ఎన్నికలు... తదితర అంశాలపై చర్చించింది. గోవా సీఎంగా ఆ రాష్ట్ర ప్రస్తుత వైద్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ పేరును బోర్డు ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సాయంత్రం నాలుగు గంటలకు సీఎం పేరును ప్రకటిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపి నడ్డా సమావేశం ముగిసిన అనంతరం మీడియాకు తెలిపారు.