: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమానికి చంద్రబాబు
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి హాజరవుతారని సీఎంవో తెలిపింది. ఇప్పటికే మోదీ కేబినెట్ లో టీడీపీ ఎంపీ అశోక గజపతిరాజు వున్నారు. తాజాగా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కూడా మంత్రి పదవి లభించనుంది. రేపటి కేబినెట్ విస్తరణలో సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.