: మోదీ 'స్వచ్ఛ భారత్' నామినేషన్ ను అంగీకరించిన రైనా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'స్వచ్ఛ భారత్ అభియాన్' నామినేషన్ ను క్రికెటర్ సురేష్ రైనా అంగీకరించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రైనా, "భారత పీఎం ద్వారా స్వచ్ఛ భారత్ కు నామినేట్ కావడం గౌరవంగా ఉంది. ప్రస్తుతం నేను యూపీలో వన్డే సీరిస్ లో ఉన్నాను. త్వరలో ఆ కార్యక్రమాన్ని చేపడతాను" అని ట్వీట్ చేశాడు. శుభ్రత మన నాగరికతను ప్రతిబింబిస్తుందన్న ఈ ఎడమచేతి వాటం ఆటగాడు... ఓ కలలా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని అందరూ సొంత మిషన్ లా చేయాలని పేర్కొన్నాడు.