: స్టాక్ మార్కెట్ ల నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పై నిషేధం
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధిపతి విజయ్ మాల్యకు ఎదురుదెబ్బ తగిలింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను స్టాక్ మార్కెట్ షేర్ల ట్రేడింగ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లు ప్రకటించాయి. ఈ నిషేధం డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది. సంస్థ ఆర్థిక త్రైమాసిక ఫలితాల నివేదికను రెండుసార్ల నుంచి సకాలంలో ఇవ్వని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.