: సల్మాన్ సోదరి పెళ్లి రిసెప్షన్ కు షారుక్ కు ఆహ్వానం!


ఎట్టకేలకు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు మరోసారి కలుసుకోబోతున్నారు. అందుకు సల్మాన్ సోదరి వివాహ రిసెప్షన్ వేదికకానుంది. ఈ నెల 18న హైదరాబాదులోని రాయల్ ఫలక్ నుమా ఫ్యాలెస్ లో సల్మాన్ ముద్దుల చెల్లి అర్పితా ఖాన్, ఆయుష్ శర్మల వివాహం జరగనుంది. 21న గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలకు ఇప్పటికే సల్మాన్ ఆహ్వానాలు పంపాడట. వారితో పాటు షారుక్ కు కూడా ఆహ్వానం పంపించినట్టు తెలిసింది. "సల్మాన్ అతిథుల లిస్టులో చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో షారుక్ ను కూడా ఆహ్వానించాడు" అని సల్లూ కుటుంబానికి దగ్గరి వ్యక్తి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News