: సానియా మీర్జా కూడా ఆత్మకథ రాస్తోంది!


హైదరాబాదీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఆత్మకథ రాయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన సానియా, ఇప్పటికే తన ఆత్మకథలొ 26 అధ్యాయాలు పూర్తి చేశానని తెలిపింది. అయితే జీవితం ఏరోజుకారోజు ముందుకు వెళుతున్న క్రమంలో, కొత్త విషయాలతో కూడిన అధ్యాయాలు కలపాల్సి ఉందని చెప్పింది. అలాగే, ఆత్మకథను ఎక్కడ ముగించాలి? అన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి, క్రీడా జీవితం గురించి ఉన్నవీ లేనివీ ఇప్పటి వరకు ఎన్నో వినిపించాయనీ, వాటన్నిటికీ ఈ పుస్తకంలో సరైన సమాధానం దొరుకుతుందని సానియా నవ్వుతూ చెప్పింది.

  • Loading...

More Telugu News