: చంద్రబాబు నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
రాజధాని భూ సమీకరణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. రాజధాని కోసం భూమి సేకరణలో తలెత్తే సమస్యలపై చర్చిస్తున్నారు.