: నేడు పాలమూరులో కేసీఆర్ పర్యటన... ‘ఆసరా’కు శ్రీకారం!
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొత్తూరులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే ఆయన, ‘ఆసరా’ పేరిట కొత్తగా ఏర్పాటు చేసిన పింఛను పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం నాట్కో పరిశ్రమ మైదానంలో్ ఏర్పాటు చేసే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.