: సుజనాకు కేంద్ర కేబినెట్ లో బెర్తు ఖరారు!
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కేంద్ర కేబినెట్ లో చోటు ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సుజనా చౌదరికి ఫోన్ చేసి ఆదివారం అందుబాటులో ఉండాలని చెప్పారు. దీంతో పార్టీ తరఫున ఆదివారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. పార్టీ తరఫున ఎవరికి అవకాశం కల్పించాలో చూడాలని కోరారు. దీంతో చంద్రబాబు, సుజనా పేరును సూచించారు. ఇదిలా ఉంటే, సుజనాకు కేబినెట్ హోాదాతో మంత్రి పదవి ఇవ్వలేమని, సహాయ మంత్రి హోదాతోనే సరిపెట్టుకోవాలని ప్రధాని సూచించారు. అయితే సహాయ మంత్రి పదవి అయినా ఫరవాలేదు కాని, స్వతంత్ర హోదా కలిగిన పదవి ఇస్తే బాగుంటుందని చంద్రబాబు తన మనసులోని మాటను బయట పెట్టారు. అయితే, సుజనాకు ఏ పదవి దక్కనుందన్న విషయం రేపటికి గాని తెలియదు.