: నేడు ఢిల్లీకి జగన్ బృందం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో కలసి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుస్తారు. ఇటీవల హుదూద్ తుపాను బీభత్సం నేపథ్యంలో కేంద్రం తక్షణ సాయంగా ప్రకటించిన వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన ఆర్థిక మంత్రిని కోరతారు.