: నేడు తెలంగాణలో మావోల బంద్...టీడీపీ మద్దతు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యవహార సరళికి నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ కు సంబంధించిన పోస్టర్లు శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా గట్టుప్పల్ లో పీపుల్స్ వార్ రాచకొండ ఏరియా పేరిట వెలిశాయి. బంద్ ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రజలను మావోలు కోరారు. పోస్టర్ల సమాచారం అందుకున్న పోలీసులు గట్టుప్పల్ చేరుకుని వాటిని చించివేయడంతో పాటు ఘటనపై విచారణ నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనూ మావోలు బంద్ లో భాగంగా రోడ్లపై చెట్టను నరికిపడేశారు. ఇదిలా ఉంటే, కేసీఆర్ తీరును వ్యతిరేకిస్తున్న టీటీడీపీ నేతలు మావోల బంద్ కు మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. మరి నేటి బంద్ లో భాగంగా టీడీపీ ఏ తరహా కార్యక్రమాలను చేపట్టనుందన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.