: నేడు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం ఓబులవారిపల్లెలో 'జన్మభూమి- మనఊరు' కార్యక్రమంలో ఆయన పాల్లొంటారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. తొలుత 'ఎన్టీఆర్ సుజల స్రవంతి'ని ప్రారంభించే ముఖ్యమంత్రి ఆ తర్వాత 'బడి పిలుస్తోంది', 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారు. గ్రామంలో కొత్తగా ఏర్పాటైన స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు అక్కడే మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవుతారు.